రామ్ చరణ్ కి నెగిటివ్

- Advertisement -
Ram Charan

రామ్ చరణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుగుసినిమా.కామ్ ఇప్పటికే రాసింది. ఇప్పుడు అఫీషియల్ గా రామ్ చరణ్ తన అభిమానులకు ఇన్ఫార్మ్ చేశాడు. “నాకు నెగిటివ్ వచ్చింది. కరోనా నుంచి కోలుకున్నాను. ఇక త్వరలోనే పని మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలని విషెస్ తెలిపిన మీ అందరికి కృతజ్ఞతలు,” అని రామ్ చరణ్ తన అభిమానులకు లెటర్ రాశాడు.

రామ్ చరణ్ గత నెలలో ఒక పార్టీలో పాల్గొన్నాడు. ఆ పార్టీకి వెళ్లిన చాలా మందికి కరోనా సోకింది. అందులో రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరికీ వచ్చింది. వరుణ్ తేజ్ ఇప్పటికే కోలుకున్నాడు, షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇప్పుడు చరణ్ కి కూడా నెగిటివ్ వచ్చింది.

రామ్ చరణ్ సంక్రాంతి తర్వాత కానీ, నెలాఖరులో కానీ “ఆర్.ఆర్.ఆర్” షూటింగ్ మళ్ళీ మొదలు పెడుతాడు. అలాగే, తన తండ్రి నటిస్తున్న “ఆచార్య” సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటాడట. ఈ నెల, వచ్చే నెల, మార్చిలో… ఇలా ఒక్కో నెలలో ఒక వారం రోజుల పాటు “ఆచార్య” షూటింగులో పార్టిసిపేట్ చేస్తాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు.

 

More

Related Stories