గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్‌కు రామ్ చ‌ర‌ణ్

రాజమౌళి తీసిన “RRR” అమెరికాలో ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా హాలీవుడ్ మేకర్స్, క్రిటిక్స్ కి బాగా నచ్చింది. అందుకే అక్కడ రకరకాల అవార్డులు లాగేసుకుంటోంది. ఆస్కార్ లు కూడా వరించే అవకాశం కనిపిస్తోంది. దాని కన్నా ముందే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ వచ్చేలా ఉన్నాయి.

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ కి చెందిన రెండు కేటగిరిల్లో ఈ సినిమా ఇప్పటికే నామినేట్ అయింది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద “నాటు నాటు” పాట అలాగే “బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్” కేట‌గిరీలో సినిమా నామినేట్ అయ్యింది. ఈ అవార్డుల్లో విజేతలకు జనవరి 11న ప్రదానం చేస్తారు. లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు రామ్ చ‌ర‌ణ్‌, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌.

“RRR” సినిమాలో రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో అదరగొట్టారు. చరణ్ ని మరో మెట్టులో నిలిపింది ఈ పాత్ర. ఈ అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేక ఇన్విటేషన్ అందుకున్న చరణ్ ఆనందంగా ఉన్నారు.

ఈ కార్యక్రమానికి తాను ముస్తాబు అవుతున్నట్లు హింట్ ఇచ్చారు. “RRR” లోగో ఉన్న బ్లాక్ క‌ల‌ర్ రాయ‌ల్ సూట్ వేసుకున్న స్టైలిష్ లుక్ ఉన్న ఫొటోను రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

 

More

Related Stories