
‘వకీల్ సాబ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 3న జరగనుంది. ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహిస్తారు. మరి ముఖ్య అతిధి ఎవరు? రామ్ చరణ్ రావడం గ్యారెంటీ. చరణ్ ఒక్కరే గెస్టా లేక ఇంకెవరైనా వస్తారా అన్నది చూడాలి. ఇప్పటివరకు మాత్రం చరణ్ ఛీఫ్ గెస్ట్ గా ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.
ఈ సినిమాని దిల్ రాజు ప్రిస్టిజియస్ గా నిర్మించారు. సో, ప్రొమోషన్ కాస్తా గట్టిగానే చెయ్యాలని అనుకుంటున్నట్లు సమాచారం. ‘వకీల్ సాబ్’ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకుడు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి మూవీ వస్తోంది. సో. ఫ్యాన్స్ ఈ మూవీపై అంచనాలు పెట్టుకున్నారు. అలాగే, వేసవి సెలవుల్లో విడుదల కానున్న మొదటి సినిమా కావడంతో ఇండస్ట్రీ కూడా దీనిపై ఆసక్తిగా ఉంది.
ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడే గాడిలో పడుతోంది. ‘వకీల్ సాబ్’తో అది మరింతగా పాజిటివ్ గా మారుతుంది అని భావిస్తున్నారు.