మరో మూడేళ్లు ఈ రెండింటితోనే

Ram Charan

రామ్ చరణ్ తన కొత్త సినిమాలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో “గేమ్ ఛేంజర్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా మొదలుపెడుతారు. బుచ్చిబాబు – రామ్ చరణ్ మూవీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయింది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్.

Advertisement

ఇక తాజాగా సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాని ప్రకటించారు. బుచ్చిబాబు సినిమా తర్వాత ఇదే చేస్తాను అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారు చరణ్. ఎందుకంటే బుచ్చిబాబు సినిమాకి ##RC16 అనే నంబర్ ఇచ్చారు. ఇక సుకుమార్ సినిమాకి #RC17 అనే వరుస నంబర్ కేటాయించారు.. అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అన్నమాట.

ఈ ఏడాది చివరి ఆరు నెలలు, వచ్చే ఏడాది మరో ఆరు నెలలు బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉంటారు చరణ్. ఆ తర్వాత అంటే 2025లో సుకుమార్ సినిమా షూటింగ్ జరుగుతుంది. 2026లో విడుదల అవుతుంది.

ఇలా 2024, 2025, 2026… ఈ రెండు సినిమాలతోనే రామ్ చరణ్ బిజీ. ఆ తర్వాత ఏ సినిమాలు ఒప్పుకుంటారో మరి.

ALSO READ: Official announcement: Ram Charan and Sukumar unite again

Advertisement
 

More

Related Stories