
రామ్ చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం.. గేమ్ ఛేంజర్. శంకర్ తీస్తున్న ఈ సినిమా షూటింగ్ సా…….గుతూనే ఉంది మూడేళ్ళుగా. ఐతే, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ రోజు (ఫిబ్రవరి 20, 2024) కొత్త షూటింగ్ షెడ్యూల్ మొదలైంది. పదిరోజుల పాటు ఉండే ఈ షూటింగ్ తో రామ్ చరణ్ ఇప్పుడు బిజీ.
ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ఎన్నికల అధికారిగా నటిస్తున్నారు. ఆయన పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరుని పోలినట్లుగా ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.
శంకర్ గతంలో తీసిన “ఒకే ఒక్కడు” చిత్రంలా ఇది చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. కార్తీక్ సుబ్బరాజ్ రాసిన ఈ కథలో చాలా బలం ఉందట.
మరోవైపు రామ్ చరణ్ అభిమానులు చరణ్ పాత్ర పేరుతో ఈ సినిమాకి సంబంధించి సొంతంగా పోస్టర్లు డిజైన్ చేసుకొని సోషల్ మీడియాలో పెడుతున్నారు.