
ఈ నెల 27న రామ్ చరణ్ 39వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటారు. మరి పుట్టిన రోజు నాడు అభిమానులు రకారకాల అప్డేట్స్ కోరుకుంటారు కదా. అందుకే ఈ సారి రామ్ చరణ్ రెండు ట్రీట్లు ఇవ్వనున్నారు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ తీస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమా నుంచి మొదటి పాట మార్చి 27న విడుదల కానుంది. “జరగండి జరగండి” అనే ఈ పాటని తమన్ కంపోజ్ చేయగా రామ్ చరణ్, కియారా అద్వానీలపై పాట చిత్రీకరించారు. ఈ పాట విడుదలతో పాటు సినిమా విడుదల తేదీ కూడాపై టీం క్లారిటీ ఇస్తుంది. అధికారికంగా విడుదల తేదీ ఏంటో తెలిసిపోతుంది ఆ రోజు.
మరోవైపు, రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీసే స్పోర్ట్స్ డ్రామా కూడా పుట్టిన రోజుకు ఒక వారం రోజుల ముందే ప్రారంభం అయ్యేలా ఉంది. ఇలా అభిమానులను ఆనందపర్చనున్నారు రామ్ చరణ్.
మరోవైపు రామ్ చరణ్ బర్త్ డే వేడుకల కోసం అభిమానులు ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు.