- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిని అందరూ “బాస్” అంటారు. ఇక చరణ్ ని చిన్న “బాస్” అని ముద్దుగా పిలుస్తారు. పెద్ద బాసులా చిన్న బాస్ మాత్రం దూకుడు చూపడం లేదు.
రామ్ చరణ్ నటించిన “ఆర్ ఆర్ ఆర్” 2022 వేసవిలో విడుదలైంది. ఇక శంకర్ తీస్తున్న “గేమ్ ఛేంజర్” సెప్టెంబర్/అక్టోబర్ 2024లో విడుదల కానుంది. అంటే రెండు సినిమాల మధ్య రెండున్నరేళ్ల గ్యాప్. వచ్చే ఏడాదిలో దర్శకుడు బుచ్చిబాబు తీసే సినిమా మొదలు కానుంది. ఈ సినిమా షూటింగ్ 2024 మొత్తం సాగుతుంది.
బుచ్చిబాబు – రామ్ చరణ్ సినిమా 2025 వేసవిలో విడుదల చెయ్యాలని ప్లాన్. ఒకవేళ షూటింగ్ ఆలస్యం ఐతే 2024 ఆగస్టులో వస్తుంది. ఇలా రామ్ చరణ్ సినిమాలకు గ్యాప్ పెరిగిపోతోంది.
రామ్ చరణ్ తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.