మళ్ళీ మెరిసిన మెగాపవర్ స్టార్

ఈ లాక్ డౌన్ టైమ్ లో సీరియల్స్, షోలు, ఇతర కార్యక్రమాలన్నీ బంద్ అవ్వడంతో సినిమాలదే పైచేయిగా నిలిచింది. ఛానెల్స్ దగ్గర కొత్త సినిమాలు కూడా లేకపోవడంతో వేసిన సినిమాల్నే మళ్లీ మళ్లీ వేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని సినిమాలు రిపీటెడ్ గా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఛానెళ్లకు రేటింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. వీటిలో మెగా హీరోలే ముందుంటున్నారు. ఈవారం కూడా రేటింగ్స్ లో వాళ్ల డామినేషన్ స్పష్టంగా కనిపించింది.

ఈ వారం (May 23 – May 29) వచ్చిన రేటింగ్స్ లో “వినయవిధేయ రామ” టాప్ లో నిలిచింది. థియేటర్లలో పెద్దగా క్లిక్ అవ్వని ఈ సినిమా బుల్లితెరపై మాత్రం స్టడీగా టీఆర్పీ సాధిస్తోంది. తాజాగా మరోసారి 7.97 టీఆర్పీ సాధించి ది బెస్ట్ అనిపించుకుంది చరణ్ మూవీ.

ఈ మూవీ తర్వాత రెండో స్థానంలో నిలిచిన సినిమా “ప్రతిరోజూ పండగే”. సాయితేజ్ నటించిన ఈ సినిమాకు 6.13 టీఆర్పీ వచ్చింది. ఇక మూడో స్థానంలో రవి తేజ నటించిన “దరువు” సినిమాకు 4.43 రేటింగ్ వచ్చింది. ఇవన్నీ ఆల్రెడీ ఎన్నోసార్లు టీవీల్లో ప్రసారమైన సినిమాలే. అయినప్పటికీ ఇప్పటికీ మంచి నంబర్స్ ఎఛీవ్ చేస్తున్నాయి.

ఇలా ఈ వారం రేటింగ్స్ లో టాప్ లో మెగా మూవీస్ నిలిచాయి. ఇక నాలుగో స్థానంలో “నువ్వు నాకు నచ్చావ్”, ఐదో స్థానంలో “బాహుబలి” నిలిచాయి. అయితే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన “తిక్క” సినిమా మాత్రం బుల్లితెర వీక్షకుల్ని కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు కేవలం 4.15 (అర్బన్) టీఆర్పీ వచ్చింది.

ఇక ఈ వారం రేటింగ్స్ లో ఓవరాల్ గా చూసుకుంటే.. ఎప్పట్లానే ఈటీవీ న్యూస్ మొదటి 5 స్థానాల్లో నిలిచి టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. అటు ఛానెల్స్ ర్యాంకింగ్స్ చూసుకుంటే.. ఎప్పట్లానే స్టార్ మా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. రెండో స్థానంలో జెమినీ, మూడో స్థానంలో ఈటీవీ, నాలుగో స్థానంలో జీ తెలుగు నిలిచాయి. వివిధ రకాల నాన్-ఫిక్షన్ కార్యక్రమాలు, సీరియళ్లు నిలిచిపోవడం ఈటీవీ, జీతెలుగుకు పెద్ద దెబ్బగా మారింది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ లేకపోవడం ఈటీవీ రేటింగ్స్ పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది,

Advertisement
 

More

Related Stories