ఫస్ట్ ప్లేస్, సెకెండ్ ప్లేస్ చరణ్ వే

Ram Charan

ఈవారం రేటింగ్స్ లో మరోసారి సత్తా చాటాడు రామ్ చరణ్. మూవీ రేటింగ్స్ లో మొదటి 2 స్థానాలు చరణ్ వే. ఓవైపు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉన్నప్పటికీ, మరోవైపు ”సాహో” లాంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ చరణ్ హవా తగ్గలేదు.

ఈవారం (నవంబర్ 7-13) రేటింగ్స్ లో ”వినయ విధేయ రామ” (5.40-అర్బన్) టాప్ లో నిలవగా.. చరణ్ కు చెందిన మరో సినిమా ”ధృవ” (4.46-అర్బన్) రెండో స్థానంలో నిలిచింది. ఇలా చెర్రీకి చెందిన 2 సినిమాలూ టాప్ లో నిలిచాయి.

ఇక మూడో స్థానంలో ప్రభాస్ నటించిన ”సాహో” (4.06-అర్బన్) మూడో స్థానంలో నిలవగా.. నాలుగో స్థానంలో ”అదుగో” (3.38-అర్బన్), ఐదోస్థానంలో ”ఐ-మనోహరుడు” (3.37-అర్బన్) నిలిచాయి.

ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. అర్బన్ లో వెయ్యి జీఆర్పీ క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది స్టార్ మా. జీ తెలుగు రెండోస్థానంలో, ఈటీవీ మూడో స్థానంలో నిలిచాయి. 

Related Stories