- Advertisement -

“ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ అతిధి పాత్ర అని మనమంతా అనుకుంటున్నాం కదా. కానీ అది గెస్ట్ రోల్ కాదంట. పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్రలోనే రామ్ చరణ్ నటిస్తున్నాడట. అంటే డాడీ చిరంజీవికి దాదాపు సమానమైన పాత్రలోనే చరణ్ నటిస్తున్నాడు.
ఇది చిరంజీవి సినిమానే. కానీ రామ్ చరణ్ కూడా మరో హీరోగా కనిపిస్తాడు. కథలో చరణ్ పాత్ర కీలకం. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్ర కాదు. “పెదరాయుడు”లో రజినీకాంత్ పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, “ఆచార్య”లో చరణ్ పాత్రకి కూడా అంటే వాల్యూ ఉందట.