రికార్డ్ సృష్టించిన చరణ్

రామ్ చరణ్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి రామ్ చరణ్ టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మార్చి 27న రిలీజైన ఈ టీజర్, ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. అత్యథిక వ్యూస్ (33.32 మిలియన్) సాధించిన తెలుగు టీజర్ గా చరిత్ర సృష్టించింది.

మొన్నటివరకు ఈ రికార్డు మహేష్ బాబు పేరిట ఉండేది. అతడు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ అత్యథిక వ్యూస్ (33.26 మిలియన్) రాబట్టింది. ఎట్టకేలకు ఆ రికార్డును “భీమ్ ఫర్ రామరాజు” టీజర్ క్రాస్ చేసింది.

అయితే చరణ్ క్రియేట్ చేసిన ఈ రికార్డ్ ఎక్కువ రోజులు ఉండదంటున్నారు చాలామంది. ఎందుకంటే, తాజాగా “రామరాజు ఫర్ భీమ్” పేరిట ఎన్టీఆర్ టీజర్ రిలీజైంది. దీనికి ఇప్పటికే 26 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. రోజూ వేల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి త్వరలోనే ఎన్టీఆర్ టీజర్ హయ్యస్ట్ వ్యూస్ సాధించిన టీజర్ గా నిలిచే అవకాశం ఉందంటోంది ట్రేడ్. 

Related Stories