రామ్ చరణ్ టైం అంతా వేస్ట్!

Ram Charan


శంకర్ తో సినిమా అనగానే ఎగిరి గంతేసి, వెంటనే ఒప్పుకున్నారు రామ్ చరణ్. కానీ, ఆ ఆనందం కొద్ది రోజులే ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా పక్కన పెట్టి ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) తీస్తున్నారు శంకర్. ఒక షెడ్యూల్ చరణ్ సినిమా, మరో షెడ్యూల్ ‘ఇండియన్ 2’, ఇలా రెండూ తీస్తానని ఆ మధ్య శంకర్ ప్రకటించారు.

కానీ, ఇప్పుడు పూర్తి ఫోకస్ ‘ఇండియన్ 2’పైనే నిలిపారు శంకర్. ఆయనకి రామ్ చరణ్ సినిమా మొదటి ప్రాధాన్యం కావడం లేదు. దాంతో, ఈ నెల అంతా ఖాళీగానే ఉన్నారు. ఆగస్టులో కూడా కొన్ని రోజుల పాటే షూటింగ్ జరిగింది.

మరోవైపు, ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో అనుకున్న సినిమా అటకెక్కింది. అతను చెప్పిన కథ రామ్ చరణ్ కి నమ్మకమ్ కలిగించలేదట. అందుకే, రామ్ చరణ్ కి ఈ నిరీక్షణ. ఒక పెద్ద హీరో ఖాళీగా ఉండాల్సి వచ్చింది.

ఇప్పుడు మరో సినిమా కోసం రామ్ చరణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, ఏవి కొలిక్కి రావట్లేదు. ‘విక్రమ్’ సినిమా హిట్ కాగానే కమల్ హాసన్ తో భారీ సినిమా వర్కవుట్ అవుతుందని నిర్మాతలకు, శంకర్ నమ్మకం కలిగింది. దాంతో, ఆగిపోయిన ‘ఇండియన్ 2’ని హడావిడిగా తీస్తున్నారు.

మరెవరైనా దర్శకుడు, ఒక సినిమాని పక్కన పెట్టి ఇంకో సినిమా మొదలు పెడితే రామ్ చరణ్ ఒప్పుకునేవాడా? ఇండస్ట్రీలో పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు ఏమి చేసినా చెల్లుతుంది. మిగతా వాళ్ళకే నిబంధనలు.

 

More

Related Stories