రామ్ కి తమిళ్లో మంచి పబ్లిసిటీ

Ram


తమిళ్ మార్కెట్ లో పట్టు సంపాదించాలనే ఉద్దేశంతోనే తమిళ దర్శకుడు లింగుస్వామి కథ ఒప్పుకున్నాడు హీరో రామ్. అలా సెట్ అయిందే… ‘ది వారియర్’. లింగుస్వామికి తమిళ చిత్రసీమలో ఎంత పట్టు ఉందో ‘ది వారియర్’ ప్రొమోషన్ హంగామా చూస్తే అర్థమవుతోంది.

సాధారణంగా తమిళ మీడియా తెలుగు హీరోలకు, తెలుగు నుంచి తమిళ్ లోకి అనువాదమైన చిత్రాలకు పెద్దగా పబ్లిసిటీ ఇవ్వదు. కానీ, ‘ది వారియర్’కి మాత్రం చెన్నైలో ప్రచారం మామూలుగా లేదు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి శంకర్, మణిరత్నం, భారతీరాజా, కార్తీక్ సుబ్బరాజ్…. ఇలా దర్శకులందరూ విచ్చేశారు. రామ్ కి మంచి ప్రచారం కల్పించారు.

ఒక విధంగా చెప్పాలంటే రామ్ కి ఇది తమిళంలో సరయిన లాంచింగ్ అని చెప్పొచ్ఛు. ఇది తమిళ్ లో క్లిక్ అయితే రామ్ అన్ని సినిమాలు ఇక అక్కడ పెద్ద ఎత్తున విడుదలవుతాయి. ప్రతి హీరో తన మార్కెట్ ని పెంచుకోవాలనుకుంటున్నాడు. రామ్ కి తమిళ్ మీద ఎందుకు ఆసక్తి అంటే…అతను పెరిగింది అక్కడే. తమిళ్లో బాగా మాట్లాడుతాడు.

 

More

Related Stories