ఆర్జీవీకి వాళ్ళ నాన్న సిఫారసు

Ram Gopal Varma

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత అంతా నెపొటిజంకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే.. వర్మ ఒక్కటే నెపొటిజంను వెనకేసుకొచ్చాడు. నెపొటిజం అనేది కేవలం బాలీవుడ్ లోనే కాదని, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటుందంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చుకున్నాడు.

దీంతో వర్మపై కూడా సెటైర్లు పడుతున్నాయి. అతడు కూడా “నెపోకిడ్” అంటూ కొందరు వాదిస్తున్నారు. ఆర్జీవీ తండ్రికి అన్నపూర్ణ స్టుడియోస్ లో పాటు.. చాలామంది ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయని.. కాబట్టే అతడికి తొందరగా అవకాశాలు వచ్చాయని వాదిస్తున్నారు కొంతమంది. దీనిపై ఆర్జీవీ సూటిగా స్పందించాడు.

“మా నాన్న నన్ను అస్సలు ఇండస్ట్రీకి తీసుకురావాలని అనుకోలేదు. కనీసం సిఫార్సులు కూడా చేయలేదు. ఆ సంగతి పక్కనపెడితే, మా నాన్న రిఫరెన్స్ ఇచ్చినా నాలో టాలెంట్ లేకపోతే ఏమయ్యేది? మా నాన్న రిఫరెన్స్ ఇవ్వకపోయినా నాలో టాలెంట్ ఉంది కాబట్టి నేను క్లిక్ అయ్యాను. కాబట్టి నెపొటిజం అనేది ఉంటుంది. కానీ అందరికీ పనిచేయదు. టాలెంట్ ఉండాలి.”

ఇలా తనదైన స్టయిల్ లో నెపొటిజంకు మద్దతు పలికాడు వర్మ. సుశాంత్ అంశంపై మరోసారి స్పందించిన వర్మ.. ఈ విషయంలో కొంతమంది బాలీవుడ్ హీరోహీరోయిన్లను టార్గెట్ చేయడం అస్సలు సరికాదంటున్నాడు. ప్రస్తుతం సుశాంత్ పై సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ అంతా వేస్ట్ డిస్కషన్ అని కొట్టిపారేశాడు.

Related Stories