
టికెట్ ధరలు తగ్గించడం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని అంటున్నారు ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నానితో వర్మ సోమవారం భేటీ అయ్యారు. ఐతే, తాను తన వ్యక్తిగత హోదాలో మాత్రమే మీట్ అయ్యాను తప్ప ఇండస్ట్రీ కి ప్రతినిధిగా కాదని వర్మ చెప్పారు.
తన మీటింగ్ వల్ల పరిస్కారం వస్తుందని భావించొద్దని అన్నారు వర్మ. టికెట్ల రేట్ల తగ్గింపు సహా ఐదు ముఖ్యమైన అంశాలపై మంత్రితో చర్చించాను అని తెలిపారు వర్మ.
“కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నేను అనుకోవడం లేదు. నేను ఇండస్ట్రీ తరపున రాలేదు. నిర్మాతగా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. ఇండస్ట్రీ, ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్య సాల్వ్ అవుతుంది. తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది,” అని చెప్పారు.
అందరికి తెలిసిన విషయమే వర్మ చెప్పారు. ఆయన నాలుగు, ఐదు రోజులుగా వేసిన ట్వీట్లు, ఈ మీటింగ్ ఎందుకు? ఇదంతా డ్రామాలో భాగమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఆంధ్రకి వెళ్లి వర్మ రొయ్యల పులావ్ తిని వచ్చాడు తప్ప ఈ మీటింగ్ వల్ల ఒరిగిందేమి లేదని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.