
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన తిక్క చూపించాడు. సెలబ్రిటీలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ మొక్కలు నాటుతుంటే, వర్మ మాత్రం రివర్స్ అయ్యాడు. తనను నామినేట్ చేసిన రాజమౌళికి సుతారంగా చురకలు అంటించాడు.
రాజమౌళి తన టీమ్ తో సహా మొక్కలు నాటాడు. పనిలోపనిగా ఆర్జీవీ, వినాయక్, పూరి జగన్నాధ్ ను నామినేట్ చేశాడు. వాళ్లు కూడా మొక్కలు నాటుతారని భావించాడు. కానీ ఆర్జీవీ మాత్రం రివర్స్ కౌంటర్ ఇచ్చాడు.
తనకు బురద ముట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదని, మరీ ముఖ్యంగా గ్రీనరీకి తనకు చాలా దూరమని చెప్పేశాడు వర్మ. మొక్కలకు తనకంటే మంచి వ్యక్తి అవసరమని ట్వీటాడు. ఇలా రాజమౌళి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు రివర్స్ అయ్యాడు వర్మ.
వర్మ ట్వీట్ తో నెటిజన్లు మరో టర్న్ తీసుకున్నారు. అసలు ఆర్జీవీ ఢిఫరెంట్ మెంటాలిటీ తెలిసి ఆయన్ని నామినేట్ చేయడమే జక్కన్న తప్పంటూ రాజమౌళిని తప్పు పెడుతున్నారు.