ఆర్జీవీ ట్వీట్లలో పస ఎంత?

RGV


పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలపడం, చనిపోయినపుడు వారి ఆత్మ శాంతించుగాక అని రిప్ మెసేజిలు పెట్టడం నచ్చదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి. అదే పద్దతిలో చాలా కాలం ఉన్నారు. కానీ, ఇటీవల ఆయన కూడా మారిపోయినట్లు కనిపిస్తోంది. హీరోల, హీరోయిన్ల బర్త్ డేలకు ట్వీట్లు వేస్తున్నారు ఆర్జీవీ.

కృష్ణంరాజు చనిపోవడంతో ఆయన గౌరవార్థం రెండు రోజుల పాటు షూటింగ్ బంద్ చెయ్యాలని వర్మ కోరడం ఆయనలో మార్పు పరిపూర్ణం అయిందని అర్థమవుతోంది. ఐతే, ఆయన ఈ ట్వీట్లు అర్ధరాత్రి 12 తర్వాత పోస్ట్ చేశారు. వర్మ “వోడ్కా ట్వీట్ల” (లెట్ నైట్ వేసే ట్వీట్లు)ను పెద్దగా సీరియస్ గా తీసుకోరు.

ఆయన వేసిన ట్వీట్లు ఒకసారి చూద్దాం…

నేను కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, చిరంజీవి, బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.

మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.

మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం.

రామ్ గోపాల్ వర్మకి నిజంగా కృష్ణంరాజుపై ఎందుకు అంత అభిమానం పుట్టుకొచ్చింది అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. శ్రీదేవి చనిపోయినప్పుడు కూడా వర్మ షూటింగ్ లు ఆపాలని కోరలేదు. రామ్ గోపాల్ వర్మ శ్రీదేవికి వీరాభిమాని.

 

More

Related Stories