పని పూర్తిచేసిన వారియర్

హీరో రామ్ పోతినేని మరో సినిమా పూర్తి చేశాడు. లింగుసామి దర్శకత్వంలో ఇతడు నటిస్తున్న ది వారియర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. జులై 14న తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. హీరో రామ్ కు స్ట్రయిట్ తమిళ రిలీజ్ ఇదే.

ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. వారం రోజులకు పైగా సాగిన ఈ  షెడ్యూల్ లో హీరో రామ్ పై ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశారు. 150 మంది డాన్సర్లు, వంద మంది మోడల్స్ తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు. ఈ సాంగ్ షూట్ తో టోటల్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.

సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. వీళ్లిద్దపై తీసిన బుల్లెట్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద హిట్టయింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

 

More

Related Stories