ఫిర్యాదుని లైట్ తీసుకున్న రామ్

- Advertisement -
Ram Pothineni

హీరో రామ్ పోతినేని – తమిళ దర్శకుడు లింగుస్వామి సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాని ఆపాలని తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రయత్నాలు ఫలించలేదు. లింగుస్వామి, జ్ఞానవేల్ రాజా మధ్య గొడవలున్నాయి. జ్ఞానవేల్ రాజా నుంచి కొంత డబ్బు తీసుకున్నారు లింగుస్వామి. దాంతో తనకు చెయ్యాల్సిన సినిమాలు చెయ్యకుండా… లింగుస్వామి మరో సినిమా మొదలుపెట్టకుండా చూడాలని తెలుగు ఫిలిం ఛాంబర్ కి ఫిర్యాదు చేశారు.

హీరో రామ్ ఈ ఫిర్యాదుని లైట్ తీసుకున్నాడు. జ్ఞానవేల్ రాజా తెలుగు సినిమా నిర్మాణ కౌన్సిల్లో కానీ, ఫిలిం ఛాంబర్ లో కానీ సభ్యుడు కాదు. సో… ఆయన ఫిర్యాదుపై చర్య తీసుకునే అధికారం ఇక్కడివారికి లేదు. ఆ విషయం తెలిసే లింగుస్వామి రామ్ తో సినిమా మొదలుపెడుతున్నారు.

ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటల్లో రెండు ట్యూన్స్ ఓకే అయ్యాయి. సాంగ్ తోనే షూటింగ్ మొదలు పెట్టేలా ఉన్నారు.

ఇక ఈ సినిమా కథ అదిరిపోయింది అని ఇటీవలే రామ్ ట్వీట్ చెయ్యడం.. ట్రేడ్ వర్గాల్లో సినిమాని హాట్ కేక్ గా మలిచింది. ఫ్యాన్స్ కూడా బాగా హోప్స్ పెట్టుకునేలా చేసింది రామ్ ట్వీట్.

 

More

Related Stories