- Advertisement -

హీరో రామ్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే కొన్ని నేషనల్ లెవల్ బ్రాండ్ క్యాంపెయిన్స్ చేశాడు. లేటెస్ట్ గా వెంకీ చేస్తున్న ఓ బ్రాండ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ‘CMR Shopping Mall Andhra Pradesh’ బ్రాండ్ కి ఇకపై రామ్ ప్రచారం చేస్తాడు.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత రామ్ కి మాస్ లో యమా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బ్రాండ్స్ కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి.
రామ్ బ్రాండ్ అంబాసిడర్ లిస్ట్ లోకి చాలా లెట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వరుసగా లాగేసుకుంటున్నాడు.
రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా సైన్ చేసే పనిలో ఉన్నాడు. బోయపాటితో ఈ సినిమా ప్లానింగ్ లో ఉందని సమాచారం.