రామ్ తో మూవీ తీస్తా

- Advertisement -
Harish Shankar


హీరో రామ్ పోతినేని మెల్లగా పెద్ద దర్శకులతో సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే, బోయపాటితో మూవీ సెట్ అయింది. ఇప్పుడు, హరీష్ శంకర్ కూడా లైన్లోకి వచ్చారు.

“రామ్ తో మూవీ తీస్తా. రామ్ ఎనర్జీ, నటన అంటే చాలా ఇష్టం. మా కాంబినేషన్లో సినిమా త్వరలోనే ఉంటుంది,” హరీష్ శంకర్ నుంచి వచ్చిన మాట ఇది. ‘ది వారియర్’ సినిమా ఈవెంట్ లో హరీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. నిజానికి హరీష్ శంకర్ కూడా ఒక మిడిల్ రేంజ్ హీరో కోసం ప్రయత్నిస్తున్న మాట నిజమే.

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో తీయాలన్న ‘భవదీయుడు భగత్ సింగ్’ ఇప్పట్లో అయ్యేలా లేదు. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. దాంతో, ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి చేసుకున్న ‘హరి హర వీర మల్లు’ భవితవ్యం ఏంటనేది ఇంకా తేలలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎన్నికలలోపు పూర్తి చెయ్యాలనుకుంటే ‘వీరమల్లు’కే ముందు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే, ‘భగత్ సింగ్’ సమీప కాలంలో సెట్స్ పైకి వెళ్లేలా లేదు.

హరీష్ శంకర్ మరో పెద్ద హీరోతో సినిమా చేద్దామనుకుంటే… ఎవరూ ఇప్పటికిపుడు ఓకె చెప్పేలా లేరు. అందుకే, రామ్ లాంటి ఎనర్జిటిక్ మిడిల్ రేంజ్ హీరో సెట్ అయితే హరీష్ కి లాభం, ఇటు రామ్ కి కూడా లాభమే.

 

More

Related Stories