రామ్ కూడా పెంచాడట

- Advertisement -
Ram Pothineni


హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు సినిమాల మార్కెట్ పెరిగింది. హిందీ డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ తో నిర్మాతలకు భారీగా డబ్బులు వస్తున్నాయి. దాంతో, ప్రతి హీరో పారితోషికం పెంచేస్తున్నాడు. ఈ లిస్ట్ లోకి మన రామ్ పోతినేని కూడా వచ్చాడట.

రామ్ ప్రస్తుతం ‘వారియర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి డైరెక్షన్ లో ఒక మూవీ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాకి ఏకంగా 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఏకంగా 5 కోట్లు పెంచేశాడు.

హిందీ డబ్బింగ్ మార్కెట్ లో క్రేజున్న హీరో…రామ్ పోతినేని.

రామ్ కి మాస్ హీరో ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు బోయపాటి డైరక్షన్లో నటిస్తే అది మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఊర మాస్ సినిమాలు తీయడంలో బోయపాటి శైలి వేరు కదా. మరి, ఇప్పుడు 15 డిమాండ్ చేస్తోన్న రామ్, రేపు బోయపాటి సినిమా కూడా హిట్టయితే 20 కూడా అడుగుతాడేమో.

అలా మన తెలుగు హీరోల మీటర్ పెరుగుతోంది.

 

More

Related Stories