రామ్ గడ్డం పెంచుతున్నాడు!

రామ్ అప్పుడే కొత్త సినిమా కోసం మేకోవర్ కి రెడీ అవుతున్నాడు. ఫుల్లుగా గడ్డం పెంచుతున్నాడు. ‘రెడ్’ సినిమాలో రెండు రకాల గెటపుల్లో కనిపించాడు. కానీ లింగుస్వామి తీసే కొత్త సినిమాలో రామ్ ఫుల్ గడ్డంతో అగుపిస్తాడు. ఇప్పుడు ఫుల్ బియర్డ్ లుక్ ఫ్యాషన్ అయింది కదా.

ఏప్రిల్ నుంచి లింగుస్వామి – రామ్ కాంబినేషన్లో రూపొందే కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు లింగుస్వామి. దేవిశ్రీప్రసాద్ లేదా తమన్ ని తీసుకునే ఛాన్స్ ఉంది. రామ్ డిఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నాడట. ఐతే, లింగుస్వామి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్లని తీసుకోవాలని అనుకుంటున్నాడు.

ఈ సినిమాని క్రిస్మస్ కి రెడీ చెయ్యాలనేది ఆలోచన.

More

Related Stories