ఇక రీమేకులకు రాం రాం!

Ram Pothineni

రామ్ పోతినేని ఈ సంక్రాంతికి ‘రెడ్’ అనే సినిమా తీసుకొచ్చాడు. అది సో సోగా ఆడింది. దాంతో, ఇకపై స్ట్రయిట్ స్టోరీస్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. అది తమిళంలో హిట్టయిన ‘తడం’ అనే సినిమాకి రీమేక్. తెలుగులో పకడ్బందీ మార్పులు చేసినా కూడా గొప్ప హిట్ రాలేదు అని రామ్ కొంత నిరాశ పడ్డాడు. అందుకే ఇకపై రీమేకులకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు.

రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్లో కొత్త సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్. ఇది పూర్తిగా స్ట్రయిట్ స్టోరీనే. ఇది విడుదల అయ్యాక కూడా తెలుగు కథలే చేస్తాడట.

రీమేకు సినిమాలు అందరికి కలిసిరావు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువ సక్సెస్ పొందారు రీమేక్ కథలతో.

More

Related Stories