కులం గురించి రామ్ కామెంట్

Ram Pothineni

ఓ రోజంతా రమేష్ హాస్పిటల్ పై, స్వర్ణ ప్యాలెస్ పై ట్వీట్స్ వేసి సంచలనం సృష్టించిన రామ్.. ఆ తర్వాత ఆ వివాదానికి ఫుల్ స్పాట్ పెట్టాడు. ఇకపై తను ఆ వివాదంపై ట్వీట్స్ పెట్టనని క్లారిటీ ఇచ్చాడు. ఇలా చెప్పిన కొద్దిసేపటికే కులానికి సంబంధించి రామ్ పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.

“కులం అనే రోగం కరోనా కంటే వేగంగా విస్తరిస్తోంది. అంతేకాదు.. కరోనా కంటే అత్యంత ప్రమాదకరం కూడా. దీన్ని సైలెంట్ గా విస్తరింపజేస్తున్న వాళ్లకు దూరంగా ఉండండి. మిమ్మల్ని లాగడానికి లేదా బయటకు తోసేయడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండండి.”

“పెద్ద కుట్ర జరుగుతోంది సీఎం సర్” అంటూ స్వర్ణప్యాలెస్ ఘటనపై వరుసగా ట్వీట్స్ చేశాడు రామ్. హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చకముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించిందంటూ ఆరోపించాడు. ఈ క్రమంలో రమేష్ హాస్పిటల్ ఛైర్మన్, తన అంకుల్ డాక్టర్ రమేష్ బాబును వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు.

దీంతో రామ్ పై కులముద్ర వేసే ప్రయత్నం చేశారు కొందరు. ఇలాంటి విమర్శలపై స్పందిస్తూ.. కరోనా కంటే కులం ప్రమాదకరం అంటూ స్పందించాడు రామ్.

Related Stories