ఇంకా రామ్ మీనమేషాలెందుకు?

Ram Pothineni

నాని అడిగేశాడు. సూర్య కదిలాడు. ఇంకా రామ్ ఆలోచించడం వేస్ట్. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిన సినిమాలను ఇంకా ఓటిటి ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేయకుండా తర్జన భర్జన పడడంలో అర్థం లేదు. ఆర్నెల్ల వరకు ఆగినా… థియేటర్లు ఎప్పుడు మొదలు అవుతాయో తెలియని పరిస్థితి. తెరిచిన తర్వాత… ఎన్ని నెలలకు సినిమా బిజినెస్ కుదురుకుంటుందో చెప్పలేం.

ఇలాంటి టైంలో …. నా సినిమా థియేటర్లోలోనే విడుదలవుతుంది అని రామ్ పట్టుపట్టడం సరైంది కాదేమో.

రామ్ నటించిన “రెడ్” సినిమా షూటింగ్ పూర్తి అయింది. అంతా  బాగుండి ఉంటే, ఏప్రిల్ లో విడుదలయి ఉండేది. తమిళ్ లో హిట్టయిన “తధం” అనే సినిమాకి ఇది రీమేక్. కిషోర్ తిరుమల డైరెక్క్షన్ లో రూపొందిన ఈ సినిమాకి స్రవంతి రవికిశోర్ నిర్మాత.

“ఇస్మార్ట్ శంకర్” సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు రామ్. ఆ ఇమేజ్ ని నిలబెట్టుకోవాలంటే తన సినిమా మాస్ థియేటర్లో పడాలి అనేది రామ్ ఆలోచన. కానీ ఇంకా ఆ థాట్ లోనే ఉండడం కరెక్ట్ కాదేమో.

Related Stories