- Advertisement -

హీరో రామ్ నటించిన “రెడ్” సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అన్న విషయంలో డౌట్స్ మొదలయ్యాయి. తెలుగుసినిమా.కామ్ సహా పలు మీడియా సంస్థలు వార్తలు రాయడంతో రామ్ స్పందించాడు. త్వరలోనే బిగ్ అప్డేట్ చెప్తాను అని ట్వీట్ చేశాడు. అంటే…. రామ్ తన “రెడ్” సినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇస్తాడన్నమాట.
మరోవైపు, రామ్ తన తదుపరి చిత్రం ఏంటనే విషయంలో ఇంకా ఎటూ తేల్చుకోలేదు.
త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక మూవీ చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. “ఇస్మార్ట్ శంకర్” తో పెరిగిన తన మూవీ మార్కెట్ మరింతగా పెరిగి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలంటే… ఒక పెద్ద దర్శకుడితో మూవీ చెయ్యాలి. అందుకోసమే రామ ప్రయత్నిస్తున్నాడు కానీ ఎందుకో సెట్ కావట్లేదు.