
రామజోగయ్యశాస్త్రి… పరిచయం అక్కర్లేని పాటల రచయిత. ‘యువసేన’లోని “మల్లీశ్వరివే మధురసాల మంజరివే” పాట నుంచి ‘అల వైకుంఠపురంలో’ “బుట్టబొమ్మ” పాట వరకు రాంజో (రామజోగయ్యశాస్త్రి) రాసిన సూపర్ హిట్ పాటలు వందలకొద్దీ ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లీడింగ్ పాటల రచయితల్లో ఒకరు.
‘సరస్వతి పుత్ర’ అనిపించుకున్న రామజోగయ్యశాస్త్రికి నటన కూడా మక్కువే. “కింగ్” సినిమాలో బ్రహ్మానందంతో కలిసి నటించారు. ఇప్పుడు హీరోయిన్ హెబా పటేల్ తో ఇలాంటి ఫోజు ఇచ్చి ఇంటర్ నెట్ లో కలకలం రేపారు రామజోగయ్యశాస్త్రి.
ఆయన ఒక కొత్త సినిమాలో ఇలా స్టయిలిష్ అవతారంలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోలాండ్ లో జరుగుతోంది.
అప్పుడప్పుడు సరదాగా నటించే ఈ పాటల రచయితకి ఈ సినిమా హిట్ అయితే మరిన్ని ఎక్కువ ఆఫర్స్ వస్తాయేమో. విలన్ పాత్రలకు కూడా సూటయ్యే దర్పం కనిపిస్తోంది ఈ సూట్ బూటు అవతారంలో.