యాక్సిడెంట్… రంభకి స్వల్ప గాయాలు


ఒకప్పటి టాప్ హీరోయిన్ రంభ ప్రస్తుతం కెనెడాలో స్థిరపడ్డారు. ఆమెకి ముగ్గురు పిల్లలు. ఐతే, పిల్లలని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా ఆమె కారు యాక్సిడెంట్ కి గురైంది. స్వల్ప గాయాలతో అందరూ బయటపడ్డారు.

రంభ కుటుంబం కెన‌డాలో వుంటోంది. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ చిత్రాల్లో రంభ న‌టించి ప్రేక్ష‌కుల్ని మెప్పించారు.

మ‌రో కారు వ‌చ్చిఆమె ప్రయాణిస్తున్న కారుని ఢీకొట్టిన‌ట్టు రంభ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కారులో పిల్లలతో పాటు వారి ఆయా, రంభ ఉన్నారు. ఐతే, కూతురు సాషా షాక్ లో ఉంది. ఆమె ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోంది.

ప్రమాదానికి సంబంధించి ఫొటోల‌ను రంభ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 46 ఏళ్ల రంభ ‘యమదొంగ’ తరవాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. భర్త ఇంద్రకుమార్ తో ఆమె కెనెడాలో సెటిల్ అయ్యారు.

 

More

Related Stories