- Advertisement -

రామ్ చరణ్, ఆయన భార్య గత వారం టాంజానియా వెళ్లారు. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం టాంజానియా. వందల కిలోమీటర్ల దూరం వ్యాపించిన అడవులు, వైల్డ్ యానిమల్స్, వాటిమధ్య సఫారీ… అక్కడి టూరిజం ప్రత్యేకత. రామ్ చరణ్ కి ఆఫ్రికాలో పర్యటించడం ఇష్టం. గతంలో కూడా ఒకట్రెండు సార్లు వెళ్లారు.
“ఆర్ ఆర్ ఆర్” సినిమా జపాన్ లో విడుదల సందర్భంగా అక్కడికి వెళ్లి ప్రమోట్ చేశాడు. ఎన్టీఆర్, రాజమౌళి ఫ్యామిలీస్ ఇండియాకి తిరిగి వచ్చాయి. రామ్ చరణ్ వెంటనే చలో టాంజానియా అంటూ భార్య ఉపాసనతో టూరు వేశారు.
హైదరాబాద్ కి తిరిగి వచ్చాక అక్కడి టూర్ ఫోటోలను విడుదల చేశారు.
రామ్ చరణ్ ఈ నెలలోనే న్యూజిలాండ్ వెళ్తాడు. శంకర్ తీస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు న్యూజిలాండ్ వెళ్లనున్నారు. రామ్ చరణ్, కియారా అద్వానీపై అక్కడ ఒక పాట తీస్తారట.