లీజ్ పై స్పందించిన ఫిలింసిటీ

Ramoji Film City

గడిచిన 3 రోజులుగా రామోజీ ఫిలింసిటీపై ఒకటే వార్తలు. ఏకంగా ఫిలింసిటీని రామోజీరావు.. 3 నెలల పాటు అద్దెకు ఇచ్చేస్తున్నారని, ఈ మేరకు డిస్నీ సంస్థ రంగంలోకి దిగిందంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఫిలింసిటీ వర్గాలు స్పందించాయి.

ప్రస్తుతానికి రామోజీ ఫిలింసిటీని లీజుకు ఇచ్చే ఆలోచన చేయడం లేదనేది ఫిలింసిటీ నుంచి వచ్చిన సమాచారం. సంస్థ నష్టాల్లో ఉందనే విషయాన్ని అంగీకరించినప్పటికీ.. లీజుకు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టంచేసింది.

తాము ఫిలింసిటీని అద్దెకు ఇస్తున్నామంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దని.. నిర్మాణ సంస్థలు ఫిలింసిటీకి వచ్చి నిరభ్యంతరంగా షూటింగ్స్ చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఫిలింసిటీ వర్గాలు పూర్తిగా ఖండించకపోవడం విశేషం.

లౌక్ డౌన్ నిబంధనల్ని సడలించడంతో పాటు షూటింగ్స్ కు అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఫిలింసిటీలో షూటింగ్స్ సందడి కనిపిస్తోంది.

Related Stories