సంక్రాంతి బరిలో రామ్

Red

సంక్రాంతి బరిలో మరో సినిమా దిగింది. ఈసారి రామ్ వంతు. మొన్నటివరకు ఓటీటీకి వస్తుందనుకున్న ‘రెడ్’ ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ కు రెడీ అయింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేద్దాం అనుకున్నారు. ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు. సరిగ్గా అదే టైమ్ కు లాక్ డౌన్ పడ్డంతో, విడుదల వాయిదా పడింది.

ఈ గ్యాప్ లో ఓటీటీ డైరక్ట్ రిలీజ్ గా సినిమా వస్తుందని ఊహాగానాలు చెలరేగాయి. కానీ రామ్ మాత్రం తన సినిమా థియేటర్లలోనే వస్తుందని విస్పష్టంగా ప్రకటించాడు. చెప్పినట్టుగానే సంక్రాంతికి థియేటర్లలోకి వస్తున్నాడు.

నిజానికి ‘రెడ్’ సినిమాను ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేయకుండా వెయిట్ చేయడానికి ఓ రీజన్ ఉంది. ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ కింద జెమినీ ఛానెల్ మంచి ఎమౌంట్ ఆఫర్ చేసింది. అదే టైమ్ లో డిజిటల్ రైట్స్ రిలీజ్ కింద కూడా మంచి ఎమౌంట్ సెట్ అయింది. దీంతో సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లింది. అందుకే నిబ్బరంగా థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేశారు.

అంతా బాగానే ఉంది కానీ రామ్ కు మాత్రం ఈసారి గట్టిపోటీ ఉంది. అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రానా చేసిన ‘అరణ్య’ సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి. వీటితో పాటు ‘రంగ్ దే’, ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అంతేకాదు, రేపోమాపో రవితేజ కూడా తన ‘క్రాక్’ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నాడు. 

Related Stories