మీకు ఎలా ఉన్నా….మాకు సూపర్!

Miheeka and Rana

2020… ఎందరికో ఒక పీడకల. లాక్డౌన్ కారణంగా కోట్లాది మంది ఆదాయం కోల్పోయారు. లక్షలాది మంది కరోనా వల్ల చనిపోయారు. కరోనా అందరి జీవితంలో ఎదో ఒక ప్రభావం చూపింది. అందుకే… 2020ని చాలామంది మర్చిపోవాలనుకుంటున్నారు. కానీ మాకు మాత్రం 2020 ఒక మధురానుభూతి అంటున్నారు రానా భార్య మిహీక.

“చాలామంది అభిప్రాయానికి భిన్నంగా 2020 నా జీవితంలో అద్భుతమైన ఇయర్,” అని పోస్ట్ చేశారు మిహీక.

అవును మరి, లాక్డౌన్ టైంలోనే రానా ఆమెకి ప్రొపోజ్ చేశాడు. వెంటనే ఇరు కుటుంబాలు వీరి ప్రేమని ఒప్పుకున్నాయి. ఘనంగా పెళ్లి చేశాయి. ఆగస్టులో ఈ జంట ఒకటైంది. హనీమూన్, కొత్త కాపురంతో రానా, మిహీక ఫుల్ జోష్ లో ఉన్నారు. అందుకే… 2020 మీకు ఎలా ఉన్నా… మాకు బాగుంది అని చెప్తోంది ఈ జంట.

కొత్త ఏడాదిని పురస్కరించుకొని భర్త రానాతో దిగిన కొత్త ఫోటోని షేర్ చేశారు మిహీక. “థాంక్యూ మై లవ్,” అంటూ రానాకి ప్రేమగా సందేశాన్ని పెట్టింది. ఈ ఫోటోకి శృతి హాసన్ సహా పలువురు సెలెబ్రిటీలు లైక్ కొట్టారు.

More

Related Stories