- Advertisement -

కర్వా చౌత్.. ఈ పేరు దక్షిణాది ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు. నార్త్ లో ఇది పాపులర్ పండగ. భర్తల కోసం భార్యలు చేసే వ్రతం ఇది.
రానా కోసం మిహికా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంది. సంప్రదాయబద్ధంగా భార్యభర్తలిద్దరూ ఈ పండగను జరుపుకున్నారు. మిహికా తల్లి.. తన కూతురు-అల్లుడు కర్వాచౌత్ ను సెలబ్రేట్ చేసుకున్న విషయాన్ని చెబుతూ ఓ ఫొటో పోస్టు చేశారు.
నిజానికి రానా ఫ్యామిలీలో కర్వా చౌత్ సంప్రదాయం లేదు. కాకపోతే మిహికా బజాజ్ కు ఉత్తరాది మూలాలున్నాయి. అందుకే వాళ్లు తమ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.