రానాతో తేజ మరోసారి!

Teja with Rana

హీరో రానా, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన “నేనేరాజు నేనే మంత్రి” పెద్ద హిట్. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్ చేశారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ గ్యాప్ లో రానా సోదరుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ ‘అహింస’ అనే ఒక చిత్రం తీశారు. అది విడుదలకు సిద్ధమైంది. కానీ, దానికి హైప్ రావడం లేదు. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

దాంతో, రానాతో మరో సినిమా తీయాలని తేజ ఫిక్స్ అయినట్లు ఉన్నారు. వీరి కలయికలో మరో సినిమా రానుంది.

‘టాప్ హీరో’, ‘దేవుడు’, ‘జంబలకిడి పంబ’, ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ వంటి సినిమాలను నిర్మించిన సీనియర్ నిర్మాత గోపినాథ్ ఆచంట ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తారట.

ఐతే, ఇది నిజంగా జరుగుతుందా లేక తమ్ముడి సినిమాకి హైప్ తెచ్చేందుకు రానా వేసిన ప్లానా అనేది చూడాలి.

Advertisement
 

More

Related Stories