ఓపెనింగ్ లేని హీరోగా మారాడా?

Rana

ఏ హీరోకి అయినా మార్కెట్ లో విలువ ఉండాలంటే హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్ బాగా రావాలి. ఒక హీరో సినిమాకి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదంటే అతనికి క్రేజ్ లేనట్లే. హీరో రానా ఇప్పుడే అదే సమస్య ఫేస్ చేస్తున్నాడు.

రానా రీసెంట్ చిత్రాలు… అరణ్య, భీమ్లానాయక్, విరాటపర్వం. ‘భీమ్లానాయక్’ వసూళ్ల క్రెడిట్ పూర్తిగా పవన్ కళ్యాణ్ కే వెళ్తుంది. మిగతా రెండు (అరణ్య, విరాటపర్వం) రానా హీరోగా నటించినవి. ‘అరణ్య’కి మొదటి వీకెండ్ కోటి రూపాయల ఓపెనింగ్ వచ్చింది. ఇటీవల విడుదలైన ‘విరాటపర్వం’ సినిమాకి మొదటి వారం రెండు కోట్లు వచ్చాయి. సాయి పల్లవి వంటి క్రేజున్న హీరోయిన్ నటిస్తే వచ్చిన మొత్తం అది.

సోలోగా రానాకి ఓపెనింగ్ తెచ్చుకున్న సత్తా తగ్గిపోయింది అని ఈ చిత్రాలు చెప్తున్నాయి. ఇంకా చెప్పాలంటే హీరోగా అతనికి ఇప్పుడు ఏమి క్రేజ్ లేదు.

రానాలో రెగ్యులర్ హీరో లక్షణాలు లేవు. ఇంటెన్స్ పాత్రలు బాగా సూట్ అవుతాయి. కానీ, ఇకపై రానాని హీరోగా చూసేందుకు జనం ఆసక్తి చూపుతారా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఐతే అతని మార్కెట్ ఆల్మోస్ట్ జీరోకి పడింది.

 

More

Related Stories