
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మూవీ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ ఒక మేకింగ్ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఖాకీ దుస్తుల్లో దర్శనమిచ్చారు. రానా సివిల్ డ్రెస్ లో కనిపిస్తున్నారు.
రానా, పవన్ కళ్యాణ్ మధ్య ఇగో ఇష్యుపై ఈ సినిమా కథ నడుస్తుందట. ఐతే, ఈ మేకింగ్ వీడియోలో రానా లుక్ గురించి పెద్దగా పాజిటివ్ కామెంట్స్ రావట్లేదు. రానా ఫేస్ లో ఇంకా ‘గ్లామర్’ రాలేదు. మునుపటి కళ లేదు. రెండేళ్ల క్రితం రానా అనారోగ్యానికి గురై అమెరికాలో చికిత్స తీసుకున్నారు. ఆ అనారోగ్యం వల్ల రానా ముఖంలో కళ తప్పింది. ఇటీవల కొంత బరువు పెరిగే ప్రయత్నం చేశారు రానా. అలాగే, గడ్డం పెంచి చెంపలను కవర్ చేశారు. కాకపోతే, రానా ‘అరణ్య’సినిమాలో కనిపించిన తీరుతో పోల్చితే కొంత నయం.
సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో నడుస్తోంది.
ALSO CHECK: Bheemla Nayak to report for Sankranthi 2022
రానా ఖాతాలో ఈ సినిమాతో పాటు ‘విరాట పర్వం’ ఉంది. ‘విరాటపర్వం’ చిత్రాన్ని డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.