పని పూర్తిచేసిన ‘రానా నాయుడు’

బాబాయ్ వెంకటేశ్, అబ్బాయ్ రానా కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ కోసం వీళ్లిద్దరూ ఇలా మరోసారి కలిశారు. ఇప్పుడీ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని రానా, వెంకీ స్టయిల్ గా ఎనౌన్స్ చేశారు. క్లాప్ బోర్డ్ పట్టుకొని, సిరీస్ షూటింగ్ కంప్లీట్ అయినట్టు ప్రకటించారు. కీలకమైన యూనిట్ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో కూడా దిగారు.

ఓ అమెరికన్ క్రైమ్ వెబ్ సిరీస్ స్ఫూర్తితో తెలుగులో ఈ సిరీస్ చేస్తున్నారు. దానికి రానా నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటిసారి రానా, వెంకీ కలిసి నటించిన ఫుల్ లెంగ్త్ డ్రామా ఇది. ఇందులో రానా అన్యాయాలు-అక్రమాలు చేస్తుంటాడు. ఇతడి తండ్రి నాయుడు పాత్రలో వెంకీ కనిపిస్తాడు. జైల్లోనే ఉంటూ రానాకు సలహాలు ఇచ్చే పాత్ర ఇది. ఈ ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మధ్య జరిగే కథతో రానా-నాయుడు తెరకెక్కింది.

ఈ సిరీస్ కోసం బాబాయ్ వెంకటేష్ ను ప్రత్యేకంగా ఒప్పించాడు రానా. అతడి బలవంతంతోనే తొలిసారి వెబ్ డ్రామాలో నటించానని వెంకీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టు సిరీస్ లో కొన్ని బూతులు కూడా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఈ సిరీస్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటిస్తారు. ఈ తెలుగు వెబ్ సిరీస్ లో బీవీఎస్ రవి ప్రమేయం కూడా ఉంది.

 

More

Related Stories