ఇంకోసారి రెడీ అంటున్న వెంకీ

- Advertisement -
Venkatesh and Rana

వెంకటేష్ కున్న ఫ్యామిలీ హీరో ఇమేజ్ మొత్తం పోయింది ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ తో. వెంకటేష్ నటించిన మొదటి వెబ్ సిరీస్ అది. తన సోదరుడి కొడుకు రానాతో కలిసి నటించారు వెంకీ. ఈ సిరీస్ ఇండియాలో బాగా క్లిక్ అయింది.

కానీ, తెలుగునాట మాత్రం ఎక్కువగా నెగెటివ్ మార్కులు పొందింది. వెంకటేష్ వంటి హీరో పచ్చి బూతులు మాట్లాడడం, సెక్స్ సీన్లలో కనిపించడం అనేది ఎవరి ఊహలోకి కూడా రాలేదు. అలాంటివన్నీ వెంకటేష్ ఇందులో చేశారు. దాంతో, ఫ్యామిలీ ఆడియెన్స్ లో అతని పేరు ఖరాబు అయింది.

తెలుగు వాళ్ళు వెంకీని అలా చూడడం జీర్ణించుకోలేదు కానీ దేశంలోని ఇతర ప్రాంతాల వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. ఆ బూతులు, ఆ శృంగార సన్నివేశాలు వాళ్ళకి కిక్ ఇచ్చాయంట. ఎన్ని విమర్శలు వచ్చినా… తమకి వ్యూస్ బాగా వచ్చాయని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఆనందపడుతోంది. అదే ఆనందంలో ఈ సిరీస్ కి రెండో సీజన్ ఉంటుంది అని తాజాగా ప్రకటించింది.

రానా, వెంకటేష్ మరోసారి ‘రానా నాయుడు 2’లో కనిపిస్తారు. ఈ సారి ఎన్ని బూతులు, ఎన్ని సెక్స్ సీన్లు చూడాలో.

 

More

Related Stories