రానా ప్లాన్స్ వేరు!

- Advertisement -

హీరో రానా ‘భీమ్లా నాయక్’లో నటించారు. వేగంగా తన ఖాతాలో ఓకే ఐదు కోట్లు వేసుకున్నారు. మరి, ఇంకో సినిమా ఎందుకు ప్రకటించడం లేదు? కరోనా రాకముందు మొదలుపెట్టిన “విరాటపర్వం” విడుదల గురించి ఎందుకు చెప్పట్లేదు? ఇలాంటి సందేహాలు మీకు వచ్చి ఉంటాయి.

తన తండ్రి సురేష్ బాబులాగే రానాది కూడా బిజినెస్ మైండ్. ఆయన లెక్కలు వేరు. ఇప్పుడు వ్యాపారం అంతా డిజిటల్ స్ట్రీమింగ్ లో ఉందనేది ఆయన భావన. అందుకే, తనకున్న భారీ పరిచయాలతో ఓటిటి సంస్థలతో పలు ఒప్పందాలు చేసుకున్నాడట. వాటికి కంటెంట్ అందించడమే టార్గెట్.

ఆ పనుల్లో రానా బిజిగా ఉన్నారు.

అలాగే రానా ఒక కొత్త సినిమాని కూడా సెట్ చేస్తున్నారు. అది త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.

 

More

Related Stories