బాబాయి పాటల్ని టచ్ చెయ్యను!

Rana Daggubati

సాయితేజ్, రామ్ చరణ్ లాంటి హీరోలు చిరంజీవి సూపర్ హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేశారు. నాగచైతన్య, నాగార్జున కూడా ఇలా రీమిక్స్ చేసిన లిస్ట్ లో ఉన్నారు. అయితే రానా మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గుతున్నాడు. తన చిన్నాన్న వెంకటేష్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లోని సాంగ్స్ ను టచ్ చేయనంటున్నాడు.

దీనికి అతడు చెబుతున్న రీజన్ కూడా చాలా ప్రాక్టికల్ గా ఉంది.

చిన్నాన్న పాటల్ని సెలక్ట్ చేసి, వాటిని రీమిక్స్ చేసి, ఆ రీమిక్స్ సాంగ్స్ కు డాన్స్ చేసేంత టాలెంట్ రానాకు లేదంట. అందుకే వెంకీ హిట్ సాంగ్స్ ను టచ్ చేయనంటున్నాడు ఈ భళ్లాలదేవుడు.

పనిలో పనిగా బాబాయ్ వెంకీ సినిమాల్లో తనకు ఇష్టమైన ఆల్బమ్స్ కూడా చెబుతున్నాడు. వెంకటేష్ నటించిన ”ప్రేమ”, ”కూలీ నంబర్-1” సినిమాల్లోని పాటలంటే రానాకు చాలా ఇష్టమంట. ఇప్పటికీ ఆ పాటల్ని వింటుంటాడట. అయితే ఆ సాంగ్స్ రీమిక్స్ జోలికెళ్ళడట.

Related Stories