ఇప్పుడు టైంకి పడుకుంటున్నా: రానా

Rana Daggubati


రానా, అయన భార్య మిహీక త్వరలోనే మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకోనున్నారు. గతేడాది ఆగస్టులో వీరి పెళ్లి జరిగింది. ఏడాదిలో తన జీవనశైలిలో ఎన్నో మంచి మార్పులు జరిగాయని చెప్తున్నారు రానా. ఒకప్పుడు టైంకి తినేవాడు కాదట. అలాగే పార్టీలు కారణంగా నిద్ర కూడా ఉండేది కాదు.

“ఇప్పుడు టైంకి తింటున్నాను. ఎక్కువ సేపు పడుకుంటున్నా. అన్ని టైంకి జరుగుతున్నాయి. లైఫ్ లో స్థిరత్వం వచ్చింది,” అని వెల్లడించారు రానా డెక్కన్ క్రానికల్ ఇంటర్వ్యూలో.

రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ సినిమాకి సంబంధించిన చివరి షూటింగ్ పార్టులో పాల్గొంటున్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యపనం కోషియం’ రీమేక్ లో నటిస్తున్నారు.

 

More

Related Stories