
రానా దగ్గుబాటి హీరో వేషాలు తగ్గించాడు అని ఇటీవలే తెలుగుసినిమా.కామ్ రాసింది. హీరోగా సినిమాలు పెద్దగా ఒప్పుకోవడం లేదు. ఎక్కువగా వేరే హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించేందుకు రానా ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది అని రాసిన విషయం తెలిసిందే. ఐతే, ఇప్పుడు రానా ఒక కొత్త సినిమాని లైన్లో పెట్టడం విశేషం.
రానా హీరోగా దర్శకుడు తేజ ఒక మూవీ చెయ్యనున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో “నేనే రాజు నేనే మంత్రి” వంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. అదే కాంబినేషన్ లో ఇప్పుడు ఇంకో చిత్రం. ఈ నెల 20న ఈ సినిమా లాంఛనంగా మొదలు కానుంది.
తన సోదరుడు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా లాంచ్ చేసినందుకు రానా ఒక సినిమా చేస్తాను అని మాటీచ్చ్చారు అని టాక్. అందుకే, రానా ఇప్పుడు హీరో వేషాలు తగ్గించినా …తేజ డైరెక్షన్ లో నటిస్తున్నారు.
పాత తరం నిర్మాత ఆచంట గోపినాథ్ కుటుంబం ఈ సినిమాని నిర్మించనున్నట్లు సమాచారం.