- Advertisement -

రానా తమ్ముడు అభిరామ్ నటించిన మొదటి చిత్రం అనేక సార్లు వాయిదా పడింది. అభిరాం తండ్రి సురేష్ బాబు అగ్ర నిర్మాత. బాబాయి వెంకటేష్ పెద్ద హీరో. వాళ్ళ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి ఉంది. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది.
అన్నీ ఉన్నా అభిరాంలో హీరో క్వాలిటీస్ తక్కువ. అందుకే, దర్శకుడు తేజ తీసిన ‘అహింస’ సినిమాని కొనేవాళ్లు లేక వాయిదా పడింది. ఫైనల్ గా వచ్చే నెల ఎదో తేదీన విడుదల కానుంది. ఐతే, అదే రోజు మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
ఒకటి రవితేజ హీరోగా నటించిన ‘రావణాసుర’, మరోటి కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘మీటర్’. వీటి ముందు ‘అహింస’ నిలబడగలదా. ఈ రెండు సినిమాల మధ్య అభిరాం సినిమా శాండ్విచ్ కావడం ఖాయం.
ఐతే, రానా ఈ సినిమాకి సపోర్ట్ గా ప్రమోషన్ చేస్తానని చెప్తున్నట్లు టాక్.