రానాతో ఆచంట భారీ చిత్రం

Achanta Gopinath and Rana

నందమూరి బాలకృష్ణ హీరోగా ‘టాప్ హీరో’, ‘దేవుడు’, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘జంబలకిడి పంబ’, రాజేంద్రప్రసాద్ హీరోగా ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’ వంటి సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. కొంత గ్యాప్ తర్వాత రానా దగ్గుబాటి హీరోగా భారీ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు ఆచంట గోపినాథ్.

“ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత మా సినిమా ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ కథ ఓకే అయ్యింది. కథ, కథనం, హీరో పాత్ర చిత్రణ కొత్తగా ఉంటాయి. దర్శకుడు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తాం” అని అన్నారు ఈ నిర్మాతలు ఆచంట గోపినాథ్, సీహెచ్ రాంబాబు.

రానా నటించిన ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే, పవన్ కళ్యాణ్ తో కలిసి ‘అయ్యపనం కోషియం’ రీమేక్ లో నటిస్తున్నాడు రానా.

More

Related Stories