గుడ్ న్యూజ్ లేదు: రానా భార్య

- Advertisement -
Rana and Miheeka


హీరో రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడా? ఈ డౌట్ కొందరి అభిమానులకు వచ్చింది. డైరెక్ట్ గా ఈ ప్రశ్నని రానా భార్యనే అడిగారు. వారికి ఆమె సమాధానం కూడా ఇవ్వడం విశేషం.

ఆమె ఇటీవల తన భర్తతో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చెయ్యడం, అందులో ఆమె కొంత బొద్దుగా కనిపించడంతో అభిమానులకు డౌట్ వచ్చింది. “గుడ్ న్యూస్ ఏమైనా చెప్పబోతున్నారా,” అని ప్రశ్నిస్తే… “అలాంటిదేమి లేదు,” అని సమాధానం వచ్చింది ఆమె నుంచి.

“పెళ్లయిన తర్వాత కొంత బరువు పెరగడం సహజమే కదా. అంతే. అంతకుమించి ఏమి లేదు,” అని మిహిక జవాబు ఇచ్చారు. ఆ విధంగా పుకార్లకు బ్రేక్ పడింది.

రానా, మిహీకల పెళ్లి రెండేళ్ల క్రితం జరిగింది. రానాని పెళ్లి చేసుకున్న తర్వాత మిహీకకి కూడా ఇంస్టాగ్రామ్ లో క్రేజ్ పెరిగింది. ఆమె కూడా రెగ్యులర్ గా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. అభిమానులతో ముచ్చటిస్తారు.

 

More

Related Stories