పెళ్లి పనులు మొదలయ్యాయి

Ranbir Kapoor and Alia Bhatt


రణబీర్, అలియా భట్ పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల మూడోవారంలో జంటగా మారనున్నారు. అటు రణబీర్, ఇటు అలియా ఇంటి వద్ద పెళ్లి సందడి కనిపిస్తోందట. పెళ్లి పనులు మొదలైనట్లు సమాచారం. ఇక రిసెప్సన్ కి వెన్యూ కోసం రణబీర్ ముంబైలో పలు ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ని పరిశీలించడం మీడియా కంటపడింది.

అలియా, రణబీర్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లి గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ముహూర్తం ఖరారు అయింది.

పెళ్లికి సినిమా స్టార్స్ ని ఎవరినీ పిలవడం లేదట. కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే ఆహ్వానం. రిసెప్సన్ గ్రాండ్ గా నిర్వహిస్తారట. దీపిక, రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, సంజయ్ లీల భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్ వంటి ప్రముఖులకు ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్స్ వెళ్లాయని సమాచారం.

పెళ్లి, రెసెప్షన్ రెండూ ముంబైలోనే జరుగుతాయి. అలియా భట్ తాతయ్య ఆరోగ్య పరిస్థితి విషమించిందట. అలియా పెళ్లిని చూడాలన్న ఆయన కోరికని మన్నించి హడావిడిగా ఈ నెలలోనే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Advertisement
 

More

Related Stories