కత్రిన ఉన్న ఇంట్లోనే అలియా కాపురం!

- Advertisement -
Alia Bhatt


రణబీర్ కపూర్, అలియా కాపురం పెట్టారు. ‘వాస్తు’ అనే బంగ్లాలో వీరి కాపురం. ఈనెల 14న వీరి వివాహం జరిగింది. రణబీర్ కి చెందిన ‘వాస్తు’ అనే ఇంట్లోనే తాజాగా కాపురం పెట్టారు.

‘వాస్తు’ అనే ఈ ఇల్లుని రణబీర్ కత్రినతో కలిసి ఉండేందుకు తీసుకున్నాడు. అలియా భట్ కన్నా ముందు రణబీర్ కత్రినతో రిలేషన్లో ఉన్నాడు. దాదాపు పెళ్లి వరకు వెళ్ళింది వారి ప్రణయం. కానీ, ఎందుకనో బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత అలియాతో 5 ఏళ్ళు బంధం కొనసాగించక పెళ్లి చేసుకున్నాడు రణబీర్.

కత్రిన ఉన్న ఈ ఇంట్లో కాపురం పెట్టేందుకు మొదట అలియా ఒప్పుకోలేదట. దాంతో, తన తాతయ్య రాజ్ కపూర్ కట్టించిన ‘కృష్ణ రాజ్’ అనే బంగ్లాని రినోవేషన్ చేయించి, అది రెడీ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని భావించాడు రణబీర్. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనులు ఇంకా పూర్తి కాలేదు. మరో ఏడాది పట్టేలా ఉందట.

దాంతో, చేసేదేమి లేక ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అందులోనే కాపురం పెట్టారు. కొత్త బంగ్లా సిద్ధం అయ్యేంతవరకు అలియా ఈ కత్రినతో కలిసి రణబీర్ ఉన్న ఇంట్లోనే తాత్కాలికంగా కాపురం పెట్టాల్సి వచ్చింది.

 

More

Related Stories