తెలుగు మార్కెట్ పై మరింతగా ఫోకస్!

Ranbir Kapoor

రణబీర్ కపూర్ కి “బ్రహ్మాస్త్ర” సినిమాతో తెలుగునాట కొంత క్రేజ్ వచ్చింది. ఆ సినిమాకి రాజమౌళి కారణం వల్ల మంచి ఓపెనింగ్ వచ్చింది. ఇక ఇప్పుడు “యానిమల్” చిత్రంతో రణబీర్ కపూర్ కి మరింత మార్కెట్ పెరిగింది.

“యానిమల్” తెలుగు వర్షన్ ఏకంగా 30 నుంచి 40 కోట్ల వరకు వసూళ్లు అందుకుంది అని అంచనా. ఏపీ, తెలంగాణాలో ఈ సినిమా తెలుగు, హిందీ వెర్షన్స్ కలిపి 75 కోట్ల నెట్ వసూల్ చేసింది. అంటే రణబీర్ కపూర్ కి సాలిడ్ మార్కెట్ ఏర్పడినట్లే.

ఏపీ, తెలంగాణలో ఇంతకుముందు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కి మంచి మార్కెట్ ఉండేది. వాళ్ళకి ఇప్పుడు పడిపోయింది. కానీ వరుసగా తన సినిమాలను తెలుగులో డబ్ చెయ్యడమే కాదు…. సినిమాల ప్రొమోషన్ కోసం హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలకు తరుచుగా వస్తూ రణబీర్ ఇక్కడ వరుసగా రెండు హిట్స్ అందుకున్నాడు.

ఇకపై చేసే తన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు రణబీర్.

Advertisement
 

More

Related Stories