- Advertisement -

‘ఉప్పెన’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న హీరో.. వైష్ణవ్ తేజ్. అతని మూడో చిత్రం… ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమా కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది. ఒక సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని మేకర్స్ ప్రకటించారు.
గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్.
లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ తో రూపొందుతోన్న ‘రంగ రంగ వైభవంగా’ సమ్మర్ లో రిలీజ్ కి సన్నద్ధమవుతోంది. రీసెంట్‌గా విడుదలైన టైటిల్ టీజర్, పాటకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందని నిర్మాతలు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
వైష్ణవ్ తేజ్ మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు.